genderequalitygoals

genderequalitygoals

Friday, 1 March 2024

బాల్యం భవితలో బాలల రక్షణ చట్టాలు – పాత్ర

jilsblognujs posted: " By Dr. Namballa Bhagyalakshmi This blog is the fourth in the series of blogs that JILS will publish in various vernacular languages as part of its initiative to mark the International Mother Language Day.) "నేటి బాలలు రేపటి దేశప్రగత"
Read on blog or Reader
Site logo image The Journal of Indian Law and Society Blog Read on blog or Reader

బాల్యం భవితలో బాలల రక్షణ చట్టాలు – పాత్ర

jilsblognujs

March 1

 
 

By Dr. Namballa Bhagyalakshmi

 

This blog is the fourth in the series of blogs that JILS will publish in various vernacular languages as part of its initiative to mark the International Mother Language Day.)

 

"నేటి బాలలు రేపటి దేశప్రగతికి సోపానాలు"

 

వరిచయం :-

 

బాల్యం ఎంతో అమూల్యం, అటువంటి బాల్యాన్ని కోల్పోయి కార్మికులుగా శ్రమ జీవులుగా మారుతున్న చిన్నారులు యింకా సమాజంలో ఉన్నారు. బాలబాలికలకు సరియైన విద్య మరియు సంపూర్ణపోషణ అందించినపుడే వారు బాధ్యత గల పౌరులుగా ఎదిగి భావితరాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం లాంటివి జరుపుకుంటున్న మనదేశంలో చిన్నారుల బంగారు భవితకోసం రూపొందించిన "చట్టాలు, భారత రాజ్యాంగంలో నిర్వచించిన "అధికరణాలు", అంతర్జాతీయ సంస్థలు, Conventions గురించి విశ్లేషంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

వివరించదగిన కారణాలు:-

 

ఈ రోజు మన సమాజంలో చిరునవ్వు, స్వేచ్చ తో కేరింతలు కొట్టాల్సిన ఎంతో మంది బాల బాలికలు పొట్టకూటికోసం చెమటోడ్చి పనిచేస్తున్నారు. వీరు దుకాణాలు, హోటళ్లు, ఇళ్ల పనికి మాత్రమే పరిమితం కాదు శివకాశీ మందుగుండు తయారీ పరిశ్రమల్లాంటి ప్రమాదకరమయిన వాతావరణంలో కూడ పనిచేస్తున్నారు. తల్లి తండ్రి లేని అనాద బాలలు మాత్రమే కాదు పేదరికం, దారిద్ర్యం, కుటుంబ ఆర్థికపరిస్టితులు, నిరక్షరాస్యత, హక్కుల పట్ల అవగాహన లేకపోవడం యిలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కువ   ఒడిదుడుకులకు లోనయ్యే వర్గం బాలలే. తమ సమస్యలను చెప్పుకోలేక, తమ హక్కులపై, తమకు గల రక్షణచట్టాలపై అవగాహన లేక హక్కుల ఉల్లంఘన తెలుసుకోలేక, భారం అయిన బాల్యం గడుపుతూ వారి భవితను శూన్యం చేసుకుంటున్నారు. కొందరు బాలలు వారి ఆకలి తీర్చుకోవడం కోసం, కుటుంబ ఆర్థిక పోషణ నిమిత్తం బాలకార్మికులుగా మారుతుంటే. తక్కువ వేతనంలో ఎక్కువ పనిచేయించుకోవచ్చు అనే ధోరణి ఉన్నవారు బాలల శ్రమ దోపిడీ కాక వారి 'బాల్యం'ను కూడా దోచుకుంటున్నారు.

 

తల్లిదండ్రుల పేదరికం మరియు నిరక్షరాస్యత :

 

తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. పేదరికం వల్ల పిల్లలు తమ మనుగడ కోసమే కాకుండా తమ కుటుంబ అవసరాల కోసం పని చేయాల్సిన దుస్థితి, పిల్లలను అదనపు ఆదాయ తెచ్చేవారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి. ఎక్కువ మంది తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు అవడంతో పిల్లల భవిష్యత్తు  ప్రశ్నార్థకంగా మారుతోంది. అర్ధిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు. సాంఘిక అర్థిక స్థితిగతులు, కుటుంబ పరిమాణం, నిరుద్యోగిత మొదలైనవి, బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్పలితాలపై అవగాహనా లోపంపిల్లల ప్రాథమిక విద్య, నైపుణ్యాల పెంపునకు కావలసిన కనీస అవకాశాల కొరత.

 

భారీ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ:

 

పల్లెల నుంచి పట్టణాలకు వలస : గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు లేక పనికోసం వలసకు వెళ్లిన చోట పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు వారు కూడా బాలకార్మికులుగా మారుతున్నారు, సమాన పనికి సమాన వేతనం కాగితంపైనే ఉండటంవల్ల చేయాల్సిన పనుల్లో పిల్లలకు తక్కువ వేతనం ఇచ్చి పనికి నియమించుకుంటున్నారు తల్లిదండ్రులు యజమానుల దగ్గర తీసుకున్న అప్పు, దానిపై వడ్డీ తేలే దాకా పిల్లలను తాకట్టు పెడతారు. ఇది వెట్టిచాకిరీయే, గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం పెరుగుతుండటంలో బాలకార్మిక వ్యవస్థకు అజ్యం పోసినట్టవుతోంది.

 

బాలకార్మిక వ్యవస్థ – ప్రభావం:

 

ఒక దేశ అభివృద్దిపై బాలకార్మిక వ్యవస్థ దీర్ధకాలిక దుష్పరిమాణాలకు, రుణాత్మక (ప్రతికూల) ఫలితాలకు దారితీస్తుంది బాలల శారీరక, మానసిక పెరుగుదల సక్రమంగా ఉండదు. పిల్లల్లో సహజంగా ఉన్న నైపుణ్యాలు, సామర్థ్యాలు నశిస్తాయి. కుటుంబ పరిమాణంలో పెరుగుదల, తద్వారా జనాభా పెరుగుదలకు దారితీస్తుంది. శ్రామిక దోపిడీ జరుగుతుంది. మానవీయ విలువలు నశిస్తాయి. భావి భారత మానవ వనరులు దుర్వినీయోగమవుతాయి తత్పలితంగా దీరకాలంలో దేశాభివృద్ది కుంటుపడుతుంది.

 

బాలకార్మిక వ్యవస్థ:

 

బాలకార్మిక వ్యవస్థను ప్రాథమిక హక్కు ఉల్లంఘనగా (ILO) అంతర్జాతీయ కార్మిక సంస్ద నిర్వచించింది. బాలలను సంరక్షణ మరియు వారి హక్కుల ఉనికి అనేది లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ (League of Nations) 1924వ సంవత్సరంలో జెనీవా డిక్షరేషన్‌ను ఆమోదించడం జరిగింది. బాలలు వారికి గల హక్కులను గుర్తించి ఏ రకమైన శ్రమ దోపిడీకి గురికాకూడదు అనే ఉద్దేశ్యంతో 1989లో (UN convention) ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌ ను స్వీకరించడం జరిగింది. యిక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసినవి UN conventions మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) convention బాలకార్మిక నిషేధం కొరకు రూపొందించబడినప్పటికీ, (ILO) convention 182 i.e. convention on the elemination of worst forms of child labour 1999 సంవత్సరంలో బాలలను బానిసత్వం బలవంతపు శమ, అక్రమ రవాణాకు గురి కాకుండా చూడటం, బాల కార్మికులను నిషేధించడం , వ్యభిచారం, అశ్లీలత, మారక ద్రవ్యాల అక్రమ రవాణా నిషేధం, ప్రమాదకర పనిలో 18 ఏళ్లలోపు బాలలను నియమించరాదనే ఉద్దేశ్యంతో రూపొందించిన ఈ (ILO) convention 182 ను సిఫేల్స్‌ (seychelles) వంటి అతి చిన్నిదేశం, అమెరికావంటి అగ్రదేశం ఆమోదించాయి. కానీ బాల కార్మిక వ్యవస్థ అత్యధికంగా ఉన్న మన భారతదేశం ఆమోదించలేక పోవడం చాలా బాధాకరమైన విషయం. బాలల రక్షణకు అంతర్జాతీయంగా 99 conventions ఉంటే మనదేశం 1/4వ వంతు మాత్రమే స్వీకరించగలిగింది.

 

బాల కార్మిక చట్టాలు:

 

బాలకార్మిక వ్యవస్థ అధికంగా ఉన్న ప్రదేశాలు, రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలను అమలు చేయడం. బాల కార్మికులు (నిషేధం మరియు నియంత్రణ) చట్టం 1986 లో చేసిన బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిపై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు ఉండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు వంటిరంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేదించింది. 2010లో సర్కస్‌లలో ఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేదించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి ఆపరాధ రుసుమును విధించడానికి సెక్షన్‌ 14 వీలు కల్పిస్తోంది. దీంట్లో జైలు శిక్ష విధించడానికి నిబంధనలున్నాయి. అయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర, కేంద పాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది, అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి.

 

విద్యాహక్కు చట్టం 2009 :

 

బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలి. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్చించడం సవాలుగా మరింది. విద్యాహక్కు చట్టం హామి ఇచ్చిన విధంగా వీరందరిని వాళ్ల వయసుకు తగిన తరగతిలో చేర్చించి విద్యనందించడం ఒక సవాలే. మధ్యలో బడిమానేయకుండా చూడటానికి ఎనిమిదో తరగతి వరకూ పిల్లలకు డిటెన్షన్‌ పద్దతి ఉండకూడదని వీరిని సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతి ద్వారా పరీక్షించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. నాణ్యమైన విద్యనందించడం ద్వారా ప్రతి ఒక్కరూ అవసరం మేరకు చదువు నేర్చుకొని, తర్వాత తరగతిలోకి ప్రవేశించగలిగేలా చాల్ని భాద్యత పాఠశాలపై ఉంటుందని చట్టం పేర్కొంటుంది. ఒక పూట బడి, ఏటా తప్పనిసరిగా బడి నడవాల్సిన రోజులు, రోజూ బడి నడవాల్సిన సమయాన్ని చట్టం నిర్ధేశిస్తోంది. విద్యా సంవత్సరంలో ఏ సమయంలో వచ్చినా తగిన తరగతిలో చేర్చుకోవాలి. అవసరమైన అదనపు శిక్షణ ఇవ్వాలి. దండనలేని బోధన అందించాలి.

బాలకార్మిక (నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986లోని సెక్షన్‌ 14 : నిబంధనలకు విరుద్ధంగా ఏ పిల్లలను పనిలో పెట్టుకున్నా లేదా ఏ పిల్లలనైనా పని చేయడానికి అనుమతించే వ్యక్తి మూడు నెలల కంటే తక్కువ కాకుండా ఒక సంవత్సరం వరకు పొడిగించగల జైలు శిక్ష లేదా జరిమానాతో శిక్షించబడతాడు పది వేల రూపాయల కంటే తక్కువ ఇది వరకు విస్తరించవచ్చు.

 

ఫ్యాక్టరీల చట్టం, 1948:

 

ఈ చట్టం 14 ఏళ్ల లేదా అంతకంటే తక్కువ వయస్సు గల పిల్లలను ఉద్యోగంలో పెట్టడాన్ని నియంత్రిసుంది. 15 నుండి 18 మధ్య వయస్సు ఉన్న కామారదశలో ఉన్న వ్యక్తి అధీకృత వైద్యవైద్యుని నుండి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ పొందగలిగితే అతను లేదా అమె ఫ్యాక్షరీలో ఉద్యోగం పొందవచ్చు. 14 నుంది 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పని గంటలు నాలుగున్నర గంటలు ఉండాలని చట్టం అందిస్తుంది మరియు రాత్రి ఫిఫ్ట్‌ పనిని పరిమితంగ చేస్తుంది.

 

గనుల చట్టం, 1952 :

 

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను గనిలో పని చేయడాన్ని చట్టం నిషేదిస్తుంది లేదా పరిమితం చేస్తుంది. ఇంకా 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే పని చేయడానికి అనుమతించబడతారని పేర్కొంది.

జువెనైల్‌ జస్టిస్‌ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015: సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లలకోసం పటిష్టమైన నిబంధనలను అందిస్తుంది. కొన్ని కీలకమైన నిబంధనలలో ఇవి ఉన్నాయి. "జువెనైల్‌ " అనే పదానికి సంబందించిన ప్రతికూల అర్ధాన్ని తొలగించడానికి చట్టం అంతటా '"బాలినుండి "చైల్ల్‌ లేదా "చైల్డ్‌ వివాదాస్పద బాలి గా నామకరణం మార్చడం. అనాద వదలివేయబడిన మరియు లొంగిపోయిన పిల్లలు వంటి అనేక కొత్త నిర్వచనాలను చేర్చడం, మరియు పిల్లలు చేసిన చిన్న తీవ్రమైన మరియు హేయమైన నేరాలు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ (JJB) మరియు చైల్డ్‌ వెల్చేర్‌ కమిటీ (CWC) అధికారాలు, విధులు మరియు బాధ్యతలలో స్పష్టత, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ (JJB) విచారణ కోసం స్పష్టమైన సమయపాలన,పదహారు సంవత్సరాల కంటే ఎక్కువవయస్సు ఉన్న పిల్లలు చేసే క్రూరమైన, నేరాలకు ప్రత్యేక నిబంధనలు, అనాథ, వదివేయబడిన మరియు లొంగిపోయిన పిల్లలను దత్తత తీసుకోవడాన్ని క్రమబద్ధీకరించడానికి, దత్తతపై ప్రత్యేక కొత్త అధ్యాయం, పిల్లలకు వ్యతిరేకంగా పనిచేసిన కొత్త నేరాలను చేర్చడం, మరియు పిల్లల సంరక్షణ సంస్థల తప్పనిసరి నమోదు.

 

బాలల హక్కులు మరియు భారతరాజ్యాంగం:

 

భారతరాజ్యాంగం కూడా బాలల పరిరక్షణకై హక్కులను అనగా సమానత్వపు హక్కు, మత, జాతి, కుల, లింగ వివక్షతకు గురికాకుండా ఉండే హక్కు, 6 నుండి 14 సంవత్సరాల బాలలందరూ ఉచిత ప్రాథమిక విద్యను పొందే హక్కు, అధికరణం 24 ద్వారా అక్రమరవాణా, కట్టు బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు మరియు 14 సంవత్సరాల వయస్సు వరకు బాలలతో ప్రమాదకరమయిన పనులు చేయించరాదని స్పష్టం చేసింది. ప్రాధమి హక్కులే కాక ఆదేశిక సూత్రాల విభాగం నందు కూడా బాలలను పనిలో పెట్టడం నిషేధిస్తూ ఆర్జికల్‌ 39 మరియు 47 ద్వారా బాలల అభివృద్ధికై సౌకర్యాలు, వసతులు కల్పించటం, సాంఘిక అన్యాయాల నుండి దోపిడీల నుండి వారిని రక్షించడం, ఆరోగ్యకరమైన ఆహారం అందేలా చూడటం ప్రభుత్వ వారి విది అని తెలియపపరిచింది.

మన దేశలో బాలలను సంరక్షించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందిచాలని అనేక చట్టాలను రూపొందించడం జరిగింది. ప్లాంటేషన్‌ కార్మిక చట్టం, 1951. గనుల చట్టం 1961, ఫ్యాక్టరీ చట్టం 1982, వెట్టిచాకిరీ నిషేధ చట్టం 1976 తదితర చట్టాలలో బాల కార్మికులను చేర్చుకోరాదని స్పష్టం చేశారు. 1979వ సంవత్సరంలో బాల కార్మిక వ్యవవస్థను నిషేధించుటకు నియంత్రించుటకు శ్రీ గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల ఆధారంగా బాల కార్మిక వ్యవస్థ (నిషేధం - నియంత్రణ) 1986 అనే చట్టంను రూపొందించి, 2016 సవరణద్వారా కౌమారులను చేర్చడం జరిగింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ యునెస్కో యూనిసెఫ్‌ వంటి సంస్థలు బాలల భవిష్యత్తుకోసం, సంక్షేమం కోసం విధి విధానాలను రూపొందిస్తూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా అడుగువేయడం అభినందనీయం. కానీ మన చట్టాల్లో ఉన్న లొసుగులు గుర్తించి వాటిని సవరించి సక్రమంగా అమలు అయ్యేలా చూసే బాధ్యత మనందరిదీ. ఒకవైపు Art . 21-A భారత రాజ్యాంగం అందరినీ విద్య ప్రధమిక హక్కు అని చెప్తూ అధికరణం 24 ద్వారా ప్రమాదకరమయిన ప్రదేశాలలో పనిచేయడం నిషేధించడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి.

 

ముగింపు :

 

బాలకార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన, దీర్ధకాల కృషి అవసరం, చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి బాలబాలికలు ఉద్యోగం నిమిత్తం పట్టణాలకు వెళ్తుంటారు. వీరు ఫ్టటణాల్లో ఆలనాపాలనా లేక అన్ని రకాల దోపిడీలకు గుఉువుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో భూ సంస్కరణలు పిష్టంగా అమలు చేస్తేపేద ప్రజల పిరస్థితులు మెరుగుపడతాయి. తమ పిల్లలను పట్టణాలకు పంపించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం విద్య, ఇతర అవకాశాల విషయాల్లో కల్పిస్తున్న వసతుల గురించి నిరక్షరాస్యులైన తల్లి దండ్రులకు అవగాహన లేకరుండా పోతోంది. వీరికి అవగాహన కల్పించేందుకు బడిబాట వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. స్వచ్చంద సేవా సంస్థలు, సమాజం, ప్రభుత్వం ఉమ్మడిగా కృషి చేయాలి.

పిల్లలు ఏరకమైన పనులు చేయరాదనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలి. మన సమాజంలో వెనుకబడిన తరగతులకు, కులాలకు చెందిన బాలలు ఎక్కువ శాతం బాల కార్మికులుగా మారుతున్నారు. 21వ శతాబ్ధంలో కూడా బాల కార్మిక వ్యవస్థ ఉంది అంటే అది మానవత్వానికే మచ్చ 2011 గణాంకాల ప్రకారం మనదేశంలో 4353247 మంది బాలకార్మికులు ఉన్నారని అంచనా, అంతర్జాతీయ కార్మిక సంస్థ 2021వ సంవత్సరం నివేదిక ప్రకారం కోవిడ్‌ -19 ప్రభావంవలన బాలకార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని (సుమారు 160 మిలియన్స్‌) తెలియజేయడం జరిరిగింది. బాలకార్మిక వ్యవస్థ ను నిర్మూలించడం ప్రభుత్వానిదే కాదు, తల్లిదండ్రులు, సమాజంలో ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలుసుకుని ప్రతీ ఒక్కరూ కృషి చేస్తే సుస్థిరాభివృద్ధి సాధిస్తాం అనడంలో సందేహం లేదు.

 

The author, Dr. Namballa Bhagyalakshmi, is a Teaching Associate at the Damodaram Sanjivayya National Law University, Sabbavaram, Visakhapatnam.

 

We would like to extend our special thanks and gratitude to Karthika Reddy Vutukuru, a second-year law student at the West Bengal National University of Juridical Sciences (NUJS), Kolkata, for assisting us with her review and inputs.

 
 

References:

  • బాల కార్మిక (నిషేధం మరియు నియంతణ) సవరణ చట్టం, 2016
  • ర్యాష్ట కార్యాచరణ విధానంలో భారత రాజ్యాంగం (జనవరి 26, 1950) ద్వారా అనేక ప్రకరణాలలో ప్రాధమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు స్టానం కల్పించబడింది.
  • 24వ ప్రకరణం: పదునాల్సేండ్లలోపు బాలలను కర్మాగారాలలో, గనులలో, ఇంక ఏ ఇతర ప్రమాదకర పనులలో కూడ ఎవ్వరూ ఉంచరాదు.
  • https://labour.gov.in/childlabour/child-labour-acts-and-rules    
  • https://www.childlineindia.org/a/issues/child-labour-issue
  • బాలకార్మిక (నిషేధం, [కమబద్దీకరణ) చట్టం, 1986
  • Right to Education Act, 2009
Comment
Like
You can also reply to this email to leave a comment.

The Journal of Indian Law and Society Blog © 2024. Manage your email settings or unsubscribe.

WordPress.com and Jetpack Logos

Get the Jetpack app

Subscribe, bookmark, and get real-time notifications - all from one app!

Download Jetpack on Google Play Download Jetpack from the App Store
WordPress.com Logo and Wordmark title=

Automattic, Inc. - 60 29th St. #343, San Francisco, CA 94110  

at March 01, 2024
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

A Quick Update From ASUN

Autistic Substance Use Network ͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏   ...

  • [New post] “You Might Go to Prison, Even if You’re Innocent”
    Delaw...
  • Autistic Mental Health Conference 2025
    Online & In-Person ͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏     ­͏    ...
  • [Blog Post] Principle #16: Take care of your teacher self.
    Dear Reader,  To read this week's post, click here:  https://teachingtenets.wordpress.com/2025/07/02/aphorism-24-take-care-of-your-teach...

Search This Blog

  • Home

About Me

GenderEqualityDigest
View my complete profile

Report Abuse

Blog Archive

  • January 2026 (32)
  • December 2025 (52)
  • November 2025 (57)
  • October 2025 (65)
  • September 2025 (71)
  • August 2025 (62)
  • July 2025 (59)
  • June 2025 (55)
  • May 2025 (34)
  • April 2025 (62)
  • March 2025 (50)
  • February 2025 (39)
  • January 2025 (44)
  • December 2024 (32)
  • November 2024 (19)
  • October 2024 (15)
  • September 2024 (19)
  • August 2024 (2651)
  • July 2024 (3129)
  • June 2024 (2936)
  • May 2024 (3138)
  • April 2024 (3103)
  • March 2024 (3214)
  • February 2024 (3054)
  • January 2024 (3244)
  • December 2023 (3092)
  • November 2023 (2678)
  • October 2023 (2235)
  • September 2023 (1691)
  • August 2023 (1347)
  • July 2023 (1465)
  • June 2023 (1484)
  • May 2023 (1488)
  • April 2023 (1383)
  • March 2023 (1469)
  • February 2023 (1268)
  • January 2023 (1364)
  • December 2022 (1351)
  • November 2022 (1343)
  • October 2022 (1062)
  • September 2022 (993)
  • August 2022 (1355)
  • July 2022 (1771)
  • June 2022 (1299)
  • May 2022 (1228)
  • April 2022 (1325)
  • March 2022 (1264)
  • February 2022 (858)
  • January 2022 (903)
  • December 2021 (1201)
  • November 2021 (3152)
  • October 2021 (2609)
Powered by Blogger.